Bus Overturns: ఏపీలో బస్సు బోల్తా.. మహిళ మృతి
![Bus overturns in AP woman dies](https://imgd.ap7am.com/thumbnail/cr-20240603tn665d4aa38212c.jpg)
- పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో ఘటన
- వర్షానికి రోడ్డుపై కూలిన చెట్లను తప్పించే క్రమంలో బోల్తా పడ్డ బస్సు
- మహిళ మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
ఏపీలోని పల్నాడు జిల్లాలో తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. భారీ వర్షానికి రోడ్డుపై పడ్డ చెట్లను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. మృతురాలిని విజయవాడకు చెందిన దివ్యగా గుర్తించారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు కర్ణాటక నుంచి యానాం వెళుతుండగా ప్రమాదం జరిగింది.