T20 World Cup 2024: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఒమ‌న్‌-న‌మీబియా మ్యాచ్ టై!

Namibia won the Super Over

  • బ్రిడ్జిటౌన్ వేదిక‌గా ఒమ‌న్‌, న‌మీబియా మ‌ధ్య మ్యాచ్
  • 19.4 ఓవ‌ర్ల‌లో 109 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ఒమ‌న్‌
  • ల‌క్ష్య‌ఛేద‌న‌లో న‌మీబియా 109 ర‌న్స్‌కే ప‌రిమితం కావ‌డంతో మ్యాచ్ టై
  • సూప‌ర్ ఓవ‌ర్‌లో న‌మీబియాను వ‌రించిన‌ విజ‌యం

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా బ్రిడ్జిటౌన్ వేదిక‌గా ఒమ‌న్‌, న‌మీబియా మ‌ధ్య జ‌రిగిన మూడో మ్యాచ్ టై అయింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఒమ‌న్ 19.4 ఓవ‌ర్ల‌లో 109 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆ త‌ర్వాత 110 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన న‌మీబియా నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఆరు వికెట్ల న‌ష్టానికి 109 ప‌రుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. 

ఇక మ్యాచ్ టై కావ‌డంతో ఐసీసీ నిబంధ‌న‌ల ప్రకారం సూప‌ర్ ఓవ‌ర్ నిర్వ‌హించారు. ఈ సూప‌ర్ ఓవ‌ర్‌లో న‌మీబియా విజ‌యం సాధించింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న‌మీబియా వికెట్ న‌ష్ట‌పోకుండా 21 ప‌రుగులు చేసింది. న‌మీబియా నిర్దేశించిన 22 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌లో ఒమ‌న్ వికెట్ న‌ష్టానికి కేవ‌లం 10 ర‌న్స్‌ మాత్ర‌మే చేసింది. దీంతో నమీబియా విజేత‌గా నిలిచింది.

T20 World Cup 2024
Oman vs Namibia
Super Over
Cricket
Sports News
  • Loading...

More Telugu News