T20 World Cup: టీ20 వరల్డ్ కప్: పాపువా న్యూ గినియాపై టాస్ నెగ్గిన వెస్టిండీస్

WI won the toss against PNG

  • ఘనంగా ప్రారంభమైన 9వ టీ20 వరల్డ్ కప్
  • తొలి మ్యాచ్ లో కెనడాను ఓడించిన అమెరికా
  • రెండో మ్యాచ్ లో వెస్టిండీస్ వర్సెస్ పాపువా న్యూ గినియా
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
  • గయానాలో మ్యాచ్

అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ 9వ టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో కెనడాపై ఆతిథ్య అమెరికా ఘనవిజయం సాధించింది. 

రెండో మ్యాచ్ లో మరో ఆతిథ్య జట్టు వెస్టిండీస్... పసిఫిక్ పసికూన పాపువా న్యూ గినియాతో తలపడుతోంది. ఈ గ్రూప్-సీ మ్యాచ్ వెస్టిండీస్ దీవుల్లోని గయానాలో జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన పాపువా న్యూ గినియా జట్టు 6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. 

ఈ పసికూన జట్టు 7 పరుగులకే 2 వికెట్లు చేజార్చుకోగా... కెప్టెన్ అసద్ వాలా 21 పరుగులు చేసి ఆదుకున్నాడు. అయితే ఓ భారీ షాట్ కొట్టే యత్నంలో అతడు కూడా అవుట్ కావడంతో పాపువా న్యూ గినియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సెసె బావు 5 పరుగులతో, హిరి హిరి సున్నా పరుగులతో ఆడుతున్నారు.

T20 World Cup
West Indies
Papua New Guinea
Guyana
  • Loading...

More Telugu News