Monsoon: రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించాయి... విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలం: ఏపీఎస్డీఎంఏ

APSDMA says monsoon likely hit Rayalaseema by three days

  • ఇప్పటికే కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
  • మరో మూడ్రోజుల్లో ఏపీలో ప్రవేశం
  • రాగల నాలుగు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన

మరో మూడ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించాయని, అవి మరింత ముందుకు కదిలేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. 

మరోవైపు, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఇవాళ చిత్తూరు, కడప, అల్లూరి సీతారామరాజు, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో  అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని... అదే సమయంలో విజయనగరం, నెల్లూరు, శ్రీకాకుళం, ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పల్నాడు, మన్యం, బాపట్ల, విశాఖ, గుంటూరు, అనకాపల్లి, ఎన్టీఆర్, కాకినాడ, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News