Toll Fee: నేటి అర్ధరాత్రి నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు

Toll fee to rise from Today Midnight Says NHIA
  • దేశవ్యాప్తంగా సగటున 5 శాతం పెంపు
  • సార్వత్రిక ఎన్నికలు పూర్తవడంతో అమలు
  • ఎన్నికలకు ముందే పెంపు నిర్ణయం
  • ఈసీ ఆదేశాలతో వాయిదా వేసిన ఎన్ హెచ్ఐఏ
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. ఛార్జీల పెంపు నిర్ణయం కొద్ది రోజుల క్రితమే తీసుకున్నప్పటికీ ఎన్నికల కారణంగా వాయిదా వేసినట్లు తెలిపింది. సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీల పెంపును అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచే టోల్ ఛార్జీలు పెంచాలని ఎన్ హెచ్ఐఏ నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ ఎన్ హెచ్ఐఏను ఎన్నికల సంఘం ఆదేశించింది.
Toll Fee
NHIA
Charges
Toll Gate
Toll Fee Increase

More Telugu News