KCR: సభలో తెలంగాణ అనే పదమే ఉపయోగించ వద్దని ఆనాడు స్పీకర్ అన్నారు: కేసీఆర్

Telangana Former CM KCR Speech At Telangana Bhavan

  • భరించలేని అమానుషానికి లోనైన తెలంగాణ
  • 1969లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తెలంగాణ ఉద్యమం
  • స్వర్గీయ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది
  • తెలంగాణ భవన్ లో దశాబ్ది వేడుకల్లో కేసీఆర్ ప్రసంగం

తెలంగాణ అనే పదమే పలకడం కష్టంగా ఉన్న రోజులను చూశామని, శాసన సభలో స్వయంగా సభాపతి ఆ పదమే వాడవద్దని ఉత్తర్వులు జారీ చేశారని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేర్కొన్నారు. భరించలేని అమానుషానికి తెలంగాణ లోనైందని గుర్తుచేసుకున్నారు. ఈమేరకు తెలంగాణ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో కేసీఆర్ ప్రసంగించారు. తొలుత అమరవీరులకు నివాళులు అర్పించిన గులాబీ బాస్.. ఇది ఉద్విగ్నమైన క్షణమని అన్నారు. ఆంధ్రా పాలకుల కారణంగా వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతంలో 1969లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని చెప్పారు.

అయితే, ఉద్యమ పంథా కొంత పక్కకు వెళ్లడంతో ఫెయిలైందని చెప్పుకొచ్చారు. నాడు తెలంగాణ కోసం ఉద్యమించిన వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్నపుడు, చల్లారిన తర్వాత కూడా తన పంథా మార్చుకోని వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని తెలిపారు. ఆయన ఆజన్మ తెలంగాణ వాది అని, ఈ ఉద్విగ్న క్షణాలలో స్వర్గీయ జయశంకర్ ను తలుచుకోకుండా ఉండలేమని వివరించారు. జయశంకర్ అన్ని సందర్భాలలో తనతో ఉండేవారని గుర్తుచేసుకున్నారు.  

తెలంగాణకు జరిగిన అన్యాయాలను జయశంకర్ ప్రశ్నిస్తూనే ఉన్నారని, వాటిని రికార్డు చేశారని కేసీఆర్ చెప్పారు. నాడు కంప్యూటర్ లు లేవని గుర్తుచేస్తూ.. తెలంగాణ ప్రాంతానికి జరిగిన ప్రతీ అన్యాయాన్నీ ఆయన రికార్డు చేశారని చెప్పారు. ప్రతీ బడ్జెట్ ను విశ్లేషించి, అందులో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తుండే వారని తెలిపారు. అందులో ముల్కి రూల్స్ ప్రధానమైనవని చెప్పారు. రాజ్ భవన్ గేటు ఎదురుగా బుల్లెట్లు కొడుతుంటే ఉద్యమకారులు రాళ్లు వేశారని.. ప్రాణాలకు తెగించి తూటాలకు ఎదురు వెళ్లారని వివరించారు. ఆ సందర్బంలో రైలు పట్టాల మీద పడి 9 మంది చనిపోయారని కేసీఆర్ చెప్పారు. సుప్రీంకోర్టు కూడా ముల్కీ రూల్స్ కు అనుకూలంగా తీర్పు వెలువరించిందని చెప్పారు. దీంతో జై ఆంధ్రా ఉద్యమం వచ్చిందన్నారు. జై ఆంధ్రా ఉద్యమంలో 70 మంది వరకు చనిపోయారని దీంతో సుప్రీంకోర్టు తీర్పుకు చెల్లుబాటు లేకుండా నాటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసిందని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.

  • Loading...

More Telugu News