Hyderabad: హైదరాబాద్‌తో ఏపీకి తెగిన బంధం.. ఇక తెలంగాణకే పరిమితం

Hyderabad Officially Separated From Andhra Pradesh As Capital

  • పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్
  • నిన్నటితో ముగిసిన గడువు
  • ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్
  • పౌరుల రక్షణ బాధ్యత ఇక ప్రభుత్వానికి బదిలీ

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్లపాటు కొనసాగిన ఉమ్మడి బంధానికి తెరపడింది. తెలంగాణ, ఏపీగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది. ఈ గడువు నిన్నటితో ముగిసింది. ఇకపై హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది. 

విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల ప్రాణ, ఆస్తి, రక్షణ, భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు. ఇప్పుడీ గడువు ముగియడంతో ఈ బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుంది.

ఏపీకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించి పాలన అందించారు. 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చినప్పటికీ రాజధాని పలానా అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది.

  • Loading...

More Telugu News