Side Effects of Milk: అతిగా పాలు తాగితే కలిగే దుష్ఫరిణామాలు ఇవే!

Side Effects of Over consumption of Milk

  • అతిగా పాలు తాగితే పలు సమస్యలు 
  • కాల్షియం విసర్జన పెరిగి ఎముకలు బోలుగా మారే అవకాశం
  • హార్మోన్ సమతౌల్యత దెబ్బతింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం
  • రోజుకు మూడు కప్పులకు మించి పాలు తాగొద్దని నిపుణుల సూచన

పాలు సంపూర్ణాహారం అన్న విషయం తెలిసిందే. అయితే, అతిగా పాలు తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

  • పాలల్లోని లాక్టోస్ అనే చక్కెర చాలా మందికి పడదు. దీని వల్ల కడుపుబ్బరం, గ్యాస్, డయేరియా, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. దీన్ని లాక్టోస్ ఇంటాలెరెన్స్ అని అంటారు.
  • కప్పు పాలల్లో 180 వరకూ కేలరీలు ఉంటాయి. కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ అతిగా తీసుకుంటే బరువు పెరిగే అవకావం ఉంది. 
  • ఫుల్ క్రీమ్ పాలల్లో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్టెరాల్ స్థాయిలు పెంచుతాయి. దీంతో, హృద్రోగాల బారిన పడే అవకాశం పెరుగుతుంది
  • ఇతర ఆహారాలను నిర్లక్ష్యం చేస్తూ పాలపైనే అతిగా ఆధారపడితే పోషకాల లోపం తలెత్తుతుంది. కీలక మినరల్స్, విటమిన్స్, పీచు పదార్థం కొరత ఏర్పడుతుంది. 
  • అతిగా పాలు తాగితే శరీరంలో ఇనుము లోపం ఏర్పడుతుంది. ఇది రక్తహీనతకు దారి తీస్తుంది. 
  • పాలల్లో సహజసిద్ధంగా ఉండే ఇన్సులీన్ గ్రోత్ ఫ్యాక్టర్ - 1 , ఇతర హార్మోన్ల కారణంగా ముఖంపై మొటిమలు ఎక్కువ కావొచ్చు
  • పాలల్లో కాల్షియం ఉన్నప్పటికీ అతిగా పాలు తాగితే ఎముకలు బోలుగా మారి విరిగిపోయే అవకాశం ఉంది. అతిగా పాలు తాగినప్పుడు కిడ్నీలు కాల్షియంను ఎక్కువగా విసర్జించడమే ఇందుకు కారణం. 
  • పాలల్లో ఉండే హార్మోన్ల కారణంగా శరీరంలో సమతౌల్యత దెబ్బతింటుంది. దీంతో క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా రావొచ్చు
  • పాలల్లో ఉండే అధిక కాల్షియంతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. 
  • నిపుణుల ప్రకారం, పెద్దలు రోజుకు మూడు కప్పుల వరకూ పాలు తాగొచ్చు. రోజూ పెరుగు తినేవారు రెండు కప్పుల పాలు మాత్రమే తీసుకోవాలి. చిన్నారుల నుంచీ టీనేజర్ల వరకూ రోజుకు రెండున్నర లేదా మూడు కప్పుల పాలు సరిపోతాయి. 

  • Loading...

More Telugu News