Madhavi Latha: హైదరాబాద్‌లో మాధవీలత గట్టి పోటీ ఇచ్చారు: ఆరా మస్తాన్

Aara Masthan Survey says MIM will win Hyderabad

  • తెలంగాణలో మజ్లిస్ హైదరాబాద్‌లో మాత్రమే పోటీ చేసిందన్న ఆరా మస్తాన్
  • హైదరాబాద్ స్థానాన్ని మజ్లిస్ పార్టీయే గెలుచుకుంటుందని జోస్యం
  • బీఆర్ఎస్ సున్నా స్థానాలకు పరిమితమవుతుందన్న ఆరా మస్తాన్

హైదరాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన కొంపెల్ల మాధవీలత ఓడిపోతున్నట్లుగా ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైందని ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది. ఈ మేరకు ఆరా మస్తాన్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను మజ్లిస్ పార్టీ హైదరాబాద్‌లో మాత్రమే పోటీ చేసిందని గుర్తు చేశారు.

ఇక్కడ బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీ ఇచ్చారని... అయినప్పటికీ మజ్లిస్ ఈ స్థానాన్ని గెలుచుకోనుందని తెలిపారు. బీఆర్ఎస్ సున్నా స్థానానికి పరిమితం కానుందన్నారు. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోనుందని, కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండనుంది తెలిపారు.

More Telugu News