BRS: ఇది మోదీ గెలుపు కాదు... రాహుల్ గాంధీ వైఫల్యం: బీఆర్ఎస్ నేత

BRS leader Karthik Reddy calls Lok Sabha exit polls a defeat for opposition

  • ప్రధాని మోదీ కంటే మరో ఎంపిక ఈ దేశంలో లేకపోవడం నిరాశపరిచిందన్న కార్తీక్ రెడ్డి
  • ప్రతిపక్షాల వైఫల్యమని కామెంట్ 
  • తెలంగాణలో బీఆర్ఎస్ మంచి పోరాటం చేసిందని వ్యాఖ్య

దేశంలో బీజేపీ అధికారంలోకి రావొచ్చునని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయని... దీనిని తాను ప్రధాని మోదీ విజయంగా భావించనని, ఇది రాహుల్ గాంధీ ఫెయిల్యూర్‌గా భావిస్తానని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 360 సీట్ల వరకు గెలుచుకుంటుందని, ఇండియా కూటమి 200 లోపు సీట్లకే పరిమితం కావొచ్చునని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో కార్తీక్ రెడ్డి స్పందిస్తూ... ప్రజలకు ప్రధాని మోదీ కంటే మరో ఎంపిక ఈ దేశంలో లేకపోవడం నిరాశపరిచిందన్నారు. ఇది మోదీ విజయం కాదని... ప్రతిపక్షాల, రాహుల్ గాంధీ వైఫల్యమని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ మంచి పోరాటం చేసిందన్నారు.

  • Loading...

More Telugu News