Perni Nani: ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై పేర్ని నాని ఏమన్నారంటే...!

Perni Nani talks about exit polls

  • దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ విడుదల
  • ఏపీలో వైసీపీకి 13, టీడీపీ కూటమి 12 లోక్ సభ స్థానాలు వస్తాయన్న ఓ సంస్థ
  • ఏపీలో వైసీపీకి 20 లోక్ సభ స్థానాలు తగ్గకుండా వస్తాయన్న పేర్ని నాని
  • 2014 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని స్పష్టీకరణ

దేశంలో సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ పై ఓ తెలుగు వార్తా చానల్ నిర్వహించిన డిబేట్ కు ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని హాజరయ్యారు. 

ఏపీలో వైసీపీకి 13, టీడీపీ కూటమికి 12 లోక్ సభ స్థానాలు వస్తాయన్న ఓ సంస్థ ఎగ్జిట్ పోల్స్ పై పేర్ని నాని స్పందించారు. తమకు 20కి పైగా లోక్ సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆయా పోల్ ఏజెన్సీలు అనుసరించే శాస్త్రీయ విధానాల్లో లోపాల వల్ల ఓటర్లను అంచనా వేయడంలో పొరబడి ఉండొచ్చని అన్నారు. 

కానీ తమకు బలమైన నమ్మకం ఉందని, పోలింగ్ రోజున తమ పార్టీ తరఫున సొంతంగా ఎగ్జిట్ పోల్స్ రూపొందించుకున్నామని పేర్ని నాని వెల్లడించారు. దాని ప్రకారం వైసీపీకి 20 లోక్ సభ స్థానాలు తగ్గవని స్పష్టం చేశారు. 

ఇక, ఈసారి వైసీపీ, టీడీపీ మధ్య ఓట్ షేరింగ్ హోరాహోరీగా ఉందన్న వాదనలపైనా పేర్ని నాని స్పందించారు. 2014లో వైఎస్ జగన్ ఇమేజ్ ను, 2019 నుంచి 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి జనంలో జగన్ కు ఉన్న ఇమేజ్ ను 100 శాతం పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. 

2014 పరిస్థితులనే ఇవాళ కూడా పరిగణనలోకి తీసుకోవాలనడం సరికాదని అభిప్రాయపడ్డారు. 2019 తర్వాత పాజిటివ్ ఓటు శాతం పెరుగుతూ వచ్చిందని పేర్ని నాని వివరించారు.

  • Loading...

More Telugu News