Exit Polls: గత ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. వాస్తవ ఫలితాలు ఇవీ!

Accuracy of past exit poll prediction in comparision with actual results

  • సీట్ల విషయంలో 2014, 2019 ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు వాస్తవ ఫలితాలకు మధ్య వ్యత్యాసం
  • రెండు ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి విజయం
  • అంచనాలకు మించి సీట్లు గెలుచుకున్న బీజేపీ

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునేది ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. గత ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో కొన్ని నిజమైతే మరికొన్ని గురితప్పాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్, వాస్తవ ఫలితాలు ఏంటో ఓసారి చూద్దాం. 

2014 ఎగ్జిట్ పోల్స్
ఎన్డీఏపై అంచనాలు
ఇండియా టుడే సిసిరో: ఎన్డీఏకు 272 సీట్లు
న్యూస్ 24 - చాణక్య : 340 సీట్లు
సీఎన్ఎన్ - ఐబీఎన్ - సీఎస్‌డీఎస్ : 280 సీట్లు
టైమ్స్ నౌ ఓఆర్జీ : 249 సీట్లు
ఏబీపీ న్యూస్ - నీల్సన్ : 274 సీట్లు
ఎన్డీటీవీ - హాన్సా రీసెర్చ్ : 272 సీట్లు

యూపీఏ పై అంచనాలు
ఇండియా టుడే సిసిరో: 115 సీట్లు
న్యూస్ 24 - చాణక్య : 101 సీట్లు
సీఎన్ఎన్ - ఐబీఎన్ - సీఎస్‌డీఎస్ : 97 సీట్లు
టైమ్స్ నౌ ఓఆర్జీ : 148 సీట్లు
ఏబీపీ న్యూస్ - నీల్సన్ : 97 సీట్లు
ఎన్డీటీవీ - హాన్సా రీసెర్చ్ : 103 సీట్లు

వాస్తవ ఫలితాలు: 336 సీట్లలో ఎన్డీయే గెలుపు, బీజేపీకి 282 సీట్లలో విజయం
యూపీఏకు 60 సీట్లు, కాంగ్రెస్‌కు కేవలం 44 సీట్లలో విజయం

2019 ఎగ్జిట్ పోల్స్ 
ఎన్డీఏ కూటమిపై అంచనాలు 
ఇండియా టుడే యాక్సిస్ : 339-365 సీట్లు
న్యూస్ 24 - చాణక్య : 350 సీట్లు
న్యూస్ 18 - ఊపీఎస్ఓఎస్ : 336 సీట్లు
టైమ్స్ నౌ వీఎమ్ఆర్ : 306 సీట్లు
ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ : 300 సీట్లు
సుదర్శన్ న్యూస్ : 305 సీట్లు

యూపీఏ కూటమిపై అంచనాలు
ఇండియా టుడే యాక్సిస్ : 77-108 సీట్లు
న్యూస్ 24 - చాణక్య : 95 సీట్లు
న్యూస్ 18 - ఊపీఎస్ఓఎస్ : 82 సీట్లు 
టైమ్స్ నౌ వీఎమ్ఆర్ : 132 సీట్లు
ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ : 120 సీట్లు
సుదర్శన్ న్యూస్ : 124 సీట్లు

వాస్తవ ఫలితాలు: 352 సీట్లతో ఎన్డీఏ కూటమి ఘటన విజయం. 303 సీట్లలో బీజేపీ జయకేతనం
యూపీఏకు 91 సీట్లు, కాంగ్రెస్‌కు 52 సీట్లలో గెలుపు

  • Loading...

More Telugu News