BJP: తెలంగాణలో బీజేపీ ఓట్ షేర్ డబుల్: న్యూస్18 మెగా ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు

BJP likely to get 37 vote share

  • తెలంగాణలో బీజేపీకి 37 శాతం ఓటు బ్యాంకు
  • బీఆర్ఎస్ పార్టీకి 21 శాతం, కాంగ్రెస్‌కు 34 శాతం ఓటింగ్
  • 2019లో బీజేపీకి 19 శాతం రాగా ఈసారి దాదాపు రెండింతలు పెరగనున్న ఓట్ షేర్

తెలంగాణలో బీజేపీకి ఓటింగ్ శాతం భారీగా పెరగనుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనా వేస్తున్నాయి. న్యూస్18 మెగా ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం... బీజేపీ 7-10, కాంగ్రెస్ 5-8, బీఆర్ఎస్ 2-5, మజ్లిస్ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీకి సీట్లు మాత్రమే కాదు ఓటింగ్ కూడా భారీగా పెరగనుందని ఎగ్జిట్ సర్వేలు చెబుతున్నాయి.

న్యూస్18 మెగా ఎగ్జిట్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 21 శాతం, బీజేపీకి 37 శాతం, కాంగ్రెస్ పార్టీకి 34 శాతం, ఇతరులకు 8 శాతం ఓట్ షేర్ రావొచ్చునని అంచనా వేసింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 19 శాతం ఓట్ షేర్ మాత్రమే వచ్చింది. ఈసారి సీట్లతో పాటు ఓటింగ్ శాతం కూడా దాదాపు డబుల్ అవుతోంది.

BJP
Telangana
Lok Sabha Polls
  • Loading...

More Telugu News