KCR: సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీల సుదీర్ఘ లేఖ

KCR writes letter to Revanth Reddy

  • తెలంగాణ అస్థిత్వాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని లేఖలో పేర్కొన్న కేసీఆర్
  • బీఆర్ఎస్‌ను... ప్రభుత్వం అడుగడుగునా అవమానించిందని ఆవేదన
  • తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజాపోరాటం... అమరుల త్యాగాల ఫలితమని వెల్లడి
  • కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను తిరోగమన దిశగా తీసుకుపోతోందన్న కేసీఆర్
  • ఇలాంటి పరిస్థితుల్లో తాను ఈ వేడుకల్లో పాల్గొనవద్దని తెలంగాణవాదుల అభిప్రాయమన్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం బహిరంగ లేఖ రాశారు. 22 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం... కేసీఆర్‌ను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో బహిరంగ లేఖ రాస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తోన్న రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో తమ పార్టీ పాల్గొనదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అస్థిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్ పోకడలను తాము నిరసిస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఇకనైనా వైఖరి మార్చుకొని సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు.

బీఆర్ఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అవమానించిందని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజాపోరాటమని... అమరుల త్యాగాల పర్యవసానమని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ దయాభిక్షగా ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1969 నుంచి ఐదు దశాబ్దాలు, భిన్నదశలలో, భిన్న మార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగిందన్నారు. అసలు తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందని... దీనిని ఆ పార్టీ దాచేసినంత మాత్రాన దాగే సత్యం కాదన్నారు.

1952లో ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్విగ్న, ఉత్తేజకరమైన సందర్భం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను తిరోగమనం దిశగా తీసుకుపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ వేడుకల్లో... కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని బీఆర్ఎస్, తెలంగాణవాదుల అభిప్రాయమని ఆ లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News