Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి పిటిషన్ ను విచారించిన హైకోర్టు... సీఐ నారాయణస్వామిపై వేటు

AP High Court orders to action on CI Narayanaswamy

  • పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజున అల్లర్లు
  • సీఐ నారాయణస్వామి శాంతిభద్రతలు కాపాడడంలో విఫలమయ్యాడన్న పిన్నెల్లి
  • పిన్నెల్లి పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన ఏపీ

ఇటీవల పోలింగ్ నేపథ్యంలో కారంపూడి సీఐ నారాయణస్వామి తనపై తప్పుడు కేసులు నమోదు చేశాడంటూ మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. శాంతిభద్రతలు కాపాడడంలో సీఐ విఫలమయ్యాడని ఆరోపించారు. 

పిన్నెల్లి పిటిషన్ పై నేడు విచారణ చేపట్టి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఐ నారాయణస్వామిని విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా సీఐ నారాయణస్వామిని విధుల నుంచి తప్పించారు. అంతేకాదు, సీఐపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముఖేశ్ కుమార్ మీనా సిట్ విచారణకు ఆదేశించారు. నిర్దిష్ట ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఏ అధికారిపై అయినా విచారణ జరుపుతామని మీనా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News