Prajwal Revanna: పోలీసులకు ఇంట్లో కనిపించని ప్రజ్వల్ రేవణ్ణ తల్లి

Sex Crimes Accused Prajwal Revanna Mother Not Found At Home
  • విచారించేందుకు ఇంటికి వెళ్లగా పోలీసులకు కనిపించని భవానీ
  • తల్లి భవానీ పరారీలో ఉన్నట్లుగా అనుమానం
  • రేవణ్ణ ఇంటి పనిమనిషి కిడ్నాప్ కేసులో భవానీకి కూడా సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు
అశ్లీల వీడియోలు, కిడ్నాప్ కేసుల్లో ప్రజ్వల్ రేవణ్ణతో పాటు తల్లి భవానీపై కూడా ఆరోపణలు వచ్చాయి. ప్రజ్వల్‌ను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు భవానీని కూడా విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు నోటీసులు కూడా ఇచ్చారు. కేసు విచారణలో భాగంగా శనివారం పోలీసులు భవానీ ఇంటికి వెళ్లారు. కానీ ఆమె అందుబాటులో లేరు. దీంతో పరారీలో ఉన్నట్లుగా భావిస్తున్నారు.

రేవణ్ణ ఇంటి పనిమనిషి కిడ్నాప్ కేసులో రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. శనివారం ఇంటికి వచ్చి ప్రశ్నిస్తామని అందులో పేర్కొన్నారు. కానీ హొళెనరసీపురలోని ఆమె నివాసానికి ఈరోజు సిట్ అధికారులు చేరుకున్న సందర్భంలో ఆమె అందుబాటులో లేరు. ఫోన్ చేసినప్పటికీ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఈ కేసులో ఆమె ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయస్థానం దానిని తిరస్కరించింది.
Prajwal Revanna
Bhavani
Karnataka

More Telugu News