GHMC: హైదరాబాద్‌లో 13 ప్రాంతాల్లో 16 హాల్స్‌లో ఓట్ల లెక్కింపు: జీహెచ్ఎంసీ కమిషనర్

GHMC Commissioner on counting day arrangments

  • కౌంటింగ్ సిబ్బందికి మే 26వ తేదీ నాటికే శిక్షణ పూర్తయినట్లు వెల్లడి
  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ ఉంటారన్న రొనాల్డ్ రాస్
  • ప్రతి కౌంటింగ్ కేంద్రంలో మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి
  • కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 17 రౌండ్లలో ఉంటుందన్న కమిషనర్

హైదరాబాద్‌లోని 13 ప్రాంతాల్లో 16 హాల్స్‌లో ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. నిజాం కాలేజీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కౌంటింగ్ సిబ్బందికి మే 26వ తేదీ నాటికే శిక్షణ పూర్తయినట్లు చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ ఉంటారని తెలిపారు.

ప్రతి కౌంటింగ్ కేంద్రంలో మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో మూడుచోట్ల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందన్నారు. ప్రతి కౌంటింగ్ హాలులో 14 టేబుల్స్ ఏర్పాటు చేశామని... జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 20 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యాకుత్‌పురాలో అత్యధికంగా 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 17 రౌండ్లలో జరుగుతుందన్నారు. ప్రతి రౌండ్‌కు అరగంట సమయం పడుతుందన్నారు.

  • Loading...

More Telugu News