Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం
- వీకెండ్ కావడంతో స్వామివారి దర్శనం కోసం పొటెత్తిన భక్తులు
- భక్తుల రద్దీతో నిండిన కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు
- ప్రస్తుతం శిలాతోరణం వరకు వేచియున్న భక్తులు
- నిన్న స్వామివారిని దర్శించుకున్న 67,873 మంది భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వీకెండ్ సెలవు దినాలు కావడంతో శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో ప్రస్తుతం భక్తులు శిలాతోరణం వరకు వేచియున్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 24 గంటల నుంచి 30 గంటల వరకు సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా, శుక్రవారం స్వామివారిని 67,873 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,532 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీకి రూ. 3.93 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.