Vamsi: అర్ధరాత్రివేళ అడవిలోకి వెళ్లి టెన్షన్ పెట్టేశాడు: డైరెక్టర్ వంశీ

Vamsi Special

  • తలకోనలో జరిగిన 'అన్వేషణ' షూటింగు
  •  ఆ ముచ్చట్లను పంచుకున్న వంశీ 
  • 'లోకి' మందేస్తే మాట వినడని వ్యాఖ్య 
  • అడవిలో పులి తిరిగేదని వెల్లడి


దర్శకుడు వంశీ తన సినిమాలకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుతూ వీడియోలు చేస్తున్నారు. అలా ఆయన 'అన్వేషణ' సినిమా ముచ్చట్లు చెప్పారు. "తలకోన ఫారెస్టులో షూటింగు జరుగుతోంది. ఈ సినిమాలో టెలిఫోన్ సత్యనారాయణగారు ఒక చిన్న వేషం వేశారు. ఆయన అన్నయ్య మూర్తిగారు మాకు అక్కడ చాలా సాయంగా నిలబడ్డారు" అని చెప్పారు. 

ఈ సినిమాకి కెమెరా మెన్ రఘు .. ఆయన సెకండ్ అసిస్టెంట్ లోకేశ్వరరావు. అతను హాస్యనటుడు రేలంగికి స్వయానా మేనల్లుడు. చాలా సరదాగా ఉంటూ సందడి చేస్తూ ఉంటాడు. రాత్రికి మందు వేశాడంటే మాత్రం తలకోనలో మృగం మాదిరిగా మారిపోతాడు. అలా ఆ రోజు మందేసి, మరో అసిస్టెంట్ శివతో గొడవేసుకున్నాడు. తనని ఎవరూ సపోర్టు చేయడం లేదనే కోపంతో బట్టలు సర్దేసుకుని ఆ చీకట్లో ఫారెస్టులోకి వెళ్లిపోయాడు.   

ఈ విషయం నాకు తెలిసేసరికి అర్థరాత్రి అయింది. మేము వచ్చిన దగ్గర నుంచి మూర్తిగారు "అడవిలో పులి తిరుగుతోంది .. చీకటిపడేలోగా వచ్చేయాలి" అని హెచ్చరిస్తూనే ఉన్నారు. అలాంటిది అంత చీకట్లో లోకేశ్వరరావు అడవిలోకి వెళ్లిపోయాడు. ఏమవుతుందో ఏమిటో అనే టెన్షన్ పెరిగిపోవడం మొదలైంది" అంటూ సస్పెన్స్ లో పెట్టారు.

Vamsi
Karthik
Bhanupriya
Anveshana
  • Loading...

More Telugu News