TSPSC: టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-1 హాల్ టికెట్ల విడుద‌ల‌

TSPSC Group 1 Hall Ticket 2024 Released

  • ఈ నెల 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష
  • రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మందికిపైగా అభ్యర్థుల దరఖాస్తు
  • మొత్తం 536 పోస్టులను భర్తీ కోసం ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం దర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో త‌మ ఐడీ, పుట్టిన తేదీ వివ‌రాలు, క్యాప్చాను ఎంటర్ చేసి హాల్ టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  

ఇక ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 9వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు జరగనుంది. మెయిన్ పరీక్షకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష ద్వారా మొత్తం 536 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష గతంలో పలు మార్లు పేపర్ లీక్ కావడంతో రద్దు చేసిన విష‌యం తెలిసిందే.

ఈ క్రమంలో గతంలో జరిగిన ప్రిలిమ్స్‌ పరీక్షకు జారీ చేసిన హాల్ టిక్కెట్లు ఇప్పుడు చెల్లుబాటు కావని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు కొత్త హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. కాగా, ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News