Nikhil: నిఖిల్ బర్త్ డే స్పెషల్ .. 'స్వయంభూ' పోస్టర్!

Swayambhu Movie Poster

  • నిఖిల్ హీరోగా రూపొందుతున్న 'స్వయంభూ'
  • చారిత్రక నేపథ్యంలో నడిచే కథాకథనాలు 
  • కథానాయికగా అలరించనున్న సంయుక్తా మీనన్ 
  • దర్శకత్వం వహించనున్న భరత్ కృష్ణమాచారి


ఈ మధ్య కాలంలో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరోల జాబితాలో నిఖిల్ కూడా కనిపిస్తాడు. 'కార్తికేయ 2'తో 100 కోట్ల హీరో అనిపించుకున్న ఆయనకి, ఆ తరువాత ఆ స్థాయి హిట్ పడలేదు. అయితే ఆయన చేతుల్లో మాత్రం మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో 'స్వయంభూ' ఒకటి. త్వరలో నిఖిల్ నుంచి రానున్న సినిమా ఇదే.

ఈ రోజున నిఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త పోస్టర్ ను వదిలారు. నిఖిల్ లుక్ డిఫరెంట్ గా ఉంది .. యుద్ధరంగంలో ఆయన ఉన్నాడనే విషయం ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. చారిత్రక నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం స్పష్టమవుతోంది. 

ఈ సినిమా యూనిట్ కి నిఖిల్ థ్యాంక్స్ చెబుతూ, షూటింగులో ప్రతి రోజు ఎంతో ఎంజాయ్ చేస్తున్నాననీ, చాలా ఎగ్జైటింగ్ గా ఉందని సమాధానమిచ్చాడు. పిక్సెల్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా సంయుక్తా మీనన్ కనిపించనుంది.

  • Loading...

More Telugu News