Venkatesh: వెంకటేశ్ తనయుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ..!

Venkatesh Mekeup Man Raghava Interview

  • వెంకటేశ్ గారివాళ్లది ఉమ్మడి కుటుంబమే 
  • ఆ ప్రేమలు వేరని చెప్పిన మేకప్ మెన్ రాఘవ
  • చిన్నాన్న అంటే రానాకి గౌరవమని వెల్లడి
  • వెంకటేశ్ తనయుడు యూఎస్ లో ఉన్నాడని వివరణ


ప్రేక్షకులలో వెంకటేశ్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అలాగే రానాకి గల ఇమేజ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. అలాంటి ఆ ఇద్దరి గురించి, వెంకటేశ్ మేకప్ మెన్ రాఘవ రీసెంటుగా 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. "రామానాయుడుగారు ఎంతో మంది దర్శకులను .. హీరోలను .. హీరోయిన్లను పరిచయం చేశారు. ప్రతి పనిని ఒక ప్రణాళిక బద్ధంగా చేసేవారాయన" అని అన్నారు. 

-"రామానాయుడు గారు ఉన్నంత కాలం వాళ్లంతా ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టే అనుకోవాలి. ఇప్పుడు కూడా వాళ్లంతా అంతే ప్రేమతో కలిసి ఉంటారు. వాళ్ల ఇంట్లో ఉండే ప్రేమాభిమానాలు నేను ఎక్కడా చూడలేదు. షూటింగు లేకపోతే అంతా కలిసే భోజనం చేస్తూ ఉంటారు. ఆస్తులు మొదలు ఏ విషయంలోనైనా గానీ వాళ్లమధ్య వాదనలు మేము చూడలేదు" అని చెప్పారు. 

ఇక ఆ ఇంట్లో ఇంగ్లిష్ పిలుపులు ఉండవు. వెంకటేశ్ గారిని రానా 'చిన్నాన్న' అనే పిలుస్తాడు. వెంకటేశ్ గారి పట్ల రానాకి మొదటి నుంచి గౌరవం ఉండేది. తాను సెట్లో ఉంటే వెంకటేశ్ గారిని మరింత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. వెంకటేశ్ గారి అబ్బాయి యూఎస్ లో చదువుకుంటున్నాడు. ప్రస్తుతానికి అతనికి సినిమా ఆలోచనలైతే లేవు. చదువు పూర్తయిన తరువాత ఆలోచన చేస్తారేమో చూడాలి" అని అన్నారు. 

More Telugu News