Pune Porsche Crash: పూణే టీనేజర్ డ్రంకెన్ డ్రైవ్ కేసులో తీర్పిచ్చిన జడ్జి ఇలా దొరికిపోయాడేంటి?.. వీడియో ఇదిగో!

Judge who gave bail to teen in Pune Porshe case trolled for not wearing a helmet while riding

  • కారుతో ఢీకొట్టి ఇద్దరు ఐటీ ఉద్యోగుల మృతికి కారణమైన టీనేజర్
  • 14 గంటల్లోనే బెయిలు ఇచ్చి రోడ్డు ప్రమాదాలపై వ్యాసం రాయమన్న జడ్జి
  • హెల్మెట్ లేకుండా స్కూటర్‌పై వెళ్తూ రిపోర్లకు దొరికిపోయిన జడ్జి 
  • మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన వైనం

పూణే టీనేజర్ కేసు డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. ఈ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తూ ప్రకంపనలు రేపుతోంది. తాగిన మత్తులో వేగంగా డ్రైవ్ చేస్తూ బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ఢీకొట్టిన బాలుడు వారి మరణానికి కారణమయ్యాడు.

ఈ కేసులో బాలుడికి 14 గంటల్లోనే బెయిలు ఇచ్చిన జువైనల్ కోర్టు జడ్జి.. రోడ్డు ప్రమాదాలపై 300 పదాలతో నిందితుడ్ని వ్యాసం రాయమని చెప్పడం వివాదాస్పదమైంది. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత బెయిలు రద్దుచేసి బాలుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో టీనేజర్ తండ్రి, తాత సహా బ్లడ్ శాంపిల్స్ మార్చిన ఇద్దరు వైద్యాధికారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడికి బదులుగా తన రక్తం ఇచ్చిన అతడి తల్లి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 

తాజాగా, ఈ కేసులో మరో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. బాలుడికి బెయిల్ ఇచ్చి, రోడ్డు ప్రమాదాలపై వ్యాసం రాయమని తీర్పు ఇచ్చిన జడ్జి హెల్మెట్ లేకుండా స్కూటర్‌పై ప్రయాణిస్తూ దొరికిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెల్మెట్ లేకుండా స్కూటర్ డ్రైవ్ చేయడం తప్పు కదా? అన్న రిపోర్టర్ల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News