Seema Chamanti Tea: నిద్రలేమితో బాధపడుతున్నారా?.. సీమ చామంతి టీ ట్రై చేయండి.. నిద్రో నిద్ర!

Benefits with Chamomile Tea

  • సీమ చామంతి టీతో బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు
  • సుఖవంతమైన నిద్రను ఇవ్వడంతోపాటు మానసిక ఆందోళనను కూడా దూరం చేస్తుందంటున్న నిపుణులు
  • సీమచామంతిలో ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు

టీ తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? ఈ చర్చ మొదలు పెడితే అది ఎప్పటికీ తెగదు. మంచిదని కొందరు, కాదని కొందరు అంటుంటారు. బ్లాక్ టీ మంచిదని కొందరి వాదన. దానికంటే గ్రీన్ టీ గొప్పదన్నది మరికొందరి ఉవాచ. పాలతో చేసే టీ నిద్రను, ఆకలిని చంపేస్తుందని అంటారు. కానీ, ఇప్పుడు చెప్పబోయే టీ నిద్రకు దివ్వౌషధం లాంటిది. మానసిక ఆందోళనను కూడా దూరం చేస్తుంది. అదేంటో తెలుసా? సీమచామంతితో చేసే టీ.

అవును.. సీమచామంతితో చేసే టీ ఆరోగ్యానికి ఎంతోమంచిదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు అందులో ఉన్నాయి. మరి అది మనమైతే ఎలా తయారుచేసుకోవాలి? రెడీమేడ్‌గా కూడా ఇది దొరకుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి.. చూసేయండి మరి!

Seema Chamanti Tea
Chamomile Tea
Health
Health Tips
AP 7AM Videos

More Telugu News