RBI: పెరుగుతున్న బ్యాంకింగ్ మోసాలు... ఆర్బీఐ తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు

RBI release annual report contained with interesting fact

  •  2022-2023 ఆర్థిక సంవత్సరంలో 13,564 బ్యాంకింగ్ మోసాలు
  • 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 36,075 మోసాలు
  • 2022-2023 ఆర్థిక సంవత్సరంలో నష్టపోయిన సొమ్ము రూ.26,127 కోట్లు
  • 2023-2024 ఆర్థిక సంవత్సరంలో నష్టపోయిన సొమ్ము రూ.13,930 కోట్లు
  • వార్షిక నివేదిక విడుదల చేసిన రిజర్వ్ బ్యాంకు

భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) తాజా నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో బ్యాంకింగ్ మోసాలు అంతకంతకు పెరుగుతున్నాయని ఈ నివేదిక చెబుతోంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 13,564 బ్యాంకింగ్ మోసాలు నమోదైతే, 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 36,075 బ్యాంకింగ్ మోసాలు నమోదయ్యాయి. 

అయితే, ఆశ్చర్యకరంగా, మోసాల్లో పోగొట్టుకున్న సొమ్ము మాత్రం తగ్గింది. 2022-23 సంవత్సరాల్లో జరిగిన బ్యాంకింగ్ మోసాల ద్వారా నష్టపోయిన సొమ్ము రూ.26,127 కోట్లు కాగా... 2023-24 ఆర్థిక సంవత్సరంలో మోసాల్లో నష్టపోయిన సొమ్ము రూ.13,930 కోట్లు అని ఆర్బీఐ వివరించింది. 

ఇక గత మూడేళ్లలో అత్యధిక మోసాలు ప్రైవేటు బ్యాంకుల్లో జరగగా... అత్యధిక సొమ్ము నష్టపోయింది ప్రభుత్వ బ్యాంకుల్లో జరిగిన మోసాల ద్వారానే అని పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల విషయంలో ఎక్కువ మోసాలు జరిగాయని, లోన్ పోర్ట్ ఫోలియో అంశంలో ఎక్కువ సొమ్ము మోసగాళ్ల పాలైందని రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. 

అంతేకాదు, మోసం జరిగిన తేదీకి, మోసపోయిన విషయం గుర్తించడానికి మధ్య చాలా సమయం పడుతోందని కూడా పేర్కొంది. ఈ మేరకు ఆర్బీఐ తన వార్షిక నివేదికలో వివరించింది.

  • Loading...

More Telugu News