TGRTC: 8,10 విద్యార్థులకు టీజీ ఆర్టీసీ శుభవార్త.. వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

TGRTC ITI says good news for 8th and 10th students
  • మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్‌లలో ప్రవేశాలు 
  • దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 10
  • ప్రవేశం పొందిన విద్యార్థులు కోరుకున్న డిపోలో అప్రెంటిషిప్ చేసుకునే అవకాశం
ఎనిమిది, పదో తరగతి చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఇది సువర్ణావకాశమే. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారి నుంచి వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు టీజీఆర్టీసీ ఐటీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్‌లలో దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు వచ్చే నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://iti.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రవేశం పొందిన విద్యార్థులు తాము కోరుకున్న ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్ చేసుకోవచ్చు. పరిమిత సంఖ్యలోనే సీట్లు ఉన్నాయని, అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు హైదరాబాద్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 91006 64452, 040-23450033, వరంగల్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9849425319, 8008136611లలో సంప్రదించవచ్చు.
TGRTC
TGRTC ITI
10th Students
Telangana

More Telugu News