Charminar: రాష్ట్ర చిహ్నంలోంచి చార్మినార్ ను తొలగించాలనుకోవడం సిగ్గుచేటు: కేటీఆర్

What a shame Congress Government wants to remove the iconic Charminar from the state Logo citing KTR

  • కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనపై మండిపడ్డ బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
  • శతాబ్దాలుగా హైదరాబాద్ కు గుర్తుగా చార్మినార్ ఉందని వెల్లడి
  • పనికిమాలిన కారణాలతో దాన్ని తొలగించాలని చూడటం సరికాదని వ్యాఖ్య

తెలంగాణ రాష్ర్ట అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ బొమ్మను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుండటంపై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా గురువారం స్పందిస్తూ ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు. తన పోస్ట్ కు రెండు చార్మినార్ ఫొటోలను జత చేశారు.

‘శతాబ్దాలుగా హైదరాబాద్‌కు ప్రతిరూపంగా, గుర్తుగా చార్మినార్ కొనసాగుతోంది. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా తెలుసు. హైదరాబాద్ గురించి ఎవరైనా తలచుకుంటే చార్మినార్‌ ను గుర్తుచేసుకోక తప్పదు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందే అన్ని లక్షణాలు ఈ చారిత్రక నిర్మాణానికి ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలను సాకుగా చూపుతూ చార్మినార్‌ చిహాన్ని రాష్ట్ర లోగో నుంచి తొలగించాలని చూస్తోంది. ఎంత సిగ్గుచేటు’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News