Reheat Foods: వీటిని మళ్లీమళ్లీ వేడిచేసి తింటున్నారా? ఆ జాబితాలో ఇవి కూడా ఉన్నాయా?

It is dangerous to reheat these foods

  • ఉరుకుల పరుగుల జీవితంలో సమయం కరవు
  • ఉదయం వండుకున్నదే రాత్రికీ వేడిచేసి తింటున్న వైనం
  • కొన్ని పదార్థాలను వేడి చేయడం వల్ల విషపూరితంగా మారే అవకాశం

ఇప్పుడంతా ఉరుకుల పరుగుల జీవితం. ఉదయాన్నే కాస్తంత ఉడికించుకుని తిని ఆఫీసుకు వెళ్లిపోయి, రాత్రి ఇంటికి వచ్చాక మళ్లీ వాటినే వేడిచేసుకుని తినేవారి సంఖ్య ఎక్కువే. సమయం అనుకూలించకపోవడం, అలసట వంటివి అందుకు కారణాలు కావొచ్చు. అయితే, అలా మళ్లీ వేడుచేసుకుని తినే పదార్థాలు ఆహారాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. ఒకసారి వండిన తర్వాత మళ్లీ వేడిచేసుకుని తినే పదార్థాల జాబితాలో ఇవి కూడా ఉన్నాయేమో చూసుకోండి. ఉంటే ఇకపై జాగ్రత్త పడండి.

ఒకసారి వండిన పదార్థాలను మళ్లీమళ్లీ వేడిచేసి తినడం వల్ల అవి విషపూరితంగా మారే అవకాశం ఉంది. అలా తీసుకున్న ఆహార పదార్థాల్లో కొన్ని వెంటనే ప్రభావం చూపించగా, మరికొన్ని దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఎప్పటికప్పుడు ఆహారాన్ని వండుకుని తినడం మంచిది. సమయం లేదని అంటారా? కాస్తంత సమయం చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆరోగ్యానికి మించినది మరేదీ లేదు కదా! సరే.. ఏ ఆహార పదార్థాలు, పానీయాలను వేడిచేసుకుని తీసుకోకూడదో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూసేయండి.

Reheat Foods
Health
Health News
Vegetables
AP 7AM Videos

More Telugu News