Vaishnavi: వైష్ణవీ చైతన్య 'చెన్నై లవ్ స్టోరీ'

Chennai Love Story Movie Update

  • 'బేబి'తో స్టార్ డమ్ తెచ్చుకున్న వైష్ణవి 
  • రీసెంటుగా థియేటర్లకు వచ్చిన 'లవ్ మీ'
  • ఆనంద్ దేవరకొండతో 'చెన్నై లవ్ స్టోరీ'
  • త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్టు 


టాలీవుడ్ లో ఇప్పుడు వైష్ణవి చైతన్యకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. 'బేబి' సినిమాతో ఆమె స్టార్ డమ్ ను అందుకుంది. ఆమె తాజా చిత్రంగా వచ్చిన 'లవ్ మీ' కూడా ప్రస్తుతం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఆ తరువాత ఆమె చేయనున్న సినిమా ఏమిటనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. 

వైష్ణవీ చైతన్య తన తదుపరి సినిమాను ఆనంద్ దేవరకొండతో చేయనుంది. 'బేబి' సినిమాలో ఈ జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అందువలన మళ్లీ ఈ జంటను తెరపై చూడటానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. అందువల్లనే ఈ ఇద్దరితో మరో ప్రాజెక్టును 'బేబి' టీమ్ ప్లాన్ చేసింది. 'చెన్నై లవ్ స్టోరీ' అనే పేరుతో ఈ సినిమా రూపొందనుంది. 

ఎస్ కె ఎన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి దర్శకత్వం వహించనున్నాడు. 'బేబి' సినిమాకి దర్శకత్వం వహించిన సాయిరాజేశ్ ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లే - మాటలు అందిస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ తాజా చిత్రంగా 'గం గం గణేశా' ఈ నెల 31వ తేదీన థియేటర్లకు రానుంది. ఆ తరువాత ఆయన 'డ్యూయెట్' సినిమాను పూర్తి చేయవలసి ఉంది. ఆ వెంటనే 'చెన్నై లవ్ స్టోరీ' సెట్స్ పైకి వెళ్లనుంది. 

Vaishnavi
Anand Devarakonda
Chennai Love Story
  • Loading...

More Telugu News