Arvind Kejriwal: సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు

SC refuses to list Arvind Kejriwal bail extension plea

  • తన బెయిల్ మరో వారం రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్
  • రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు అవకాశముందన్న సుప్రీం రిజిస్ట్రీ
  • అందుకే పిటిషన్ లిస్టింగ్‌కు నిరాకరించిన సుప్రీం రిజిస్ట్రీ

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారించే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన దాఖలు చేసిన పిటిషన్ లిస్టింగ్‌కు సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని తెలిపింది. అందుకే ఈ పిటిషన్ విచారణార్హమైనది కాదని పేర్కొంది.

అనారోగ్య, వైద్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందిన కేజ్రీవాల్ జూన్ 2న కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉంది. అయితే తనకు మరో వారం రోజులు గడువు పొడిగించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంత బెయిల్‌ను పొడిగించాలని కోరారు. తాను జూన్ 9న లొంగిపోతానని పేర్కొన్నారు. కానీ సుప్రీంకోర్టులో ఆయనకు చుక్కెదురైంది.

Arvind Kejriwal
AAP
Supreme Court
  • Loading...

More Telugu News