Rinku Singh: స్టార్క్‌కు రూ. 24.75 కోట్లు, త‌న‌కు రూ. 55 ల‌క్ష‌లు.. రింకూ స్పంద‌న ఇదే!

Rinku Singh Fiery Reply On Low KKR Salary

  • ఏడేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న రింకూ సింగ్‌
  • తన పవర్‌ హిట్టింగ్‌తో కేకేఆర్‌లో కీల‌క ప్లేయ‌ర్‌గా రింకూ
  • ప్ర‌స్తుతం అతడికి రూ.55 లక్షలు మాత్రేమ ఇస్తోన్న ఫ్రాంచైజీ 
  • రూ. 55 లక్షలు కూడా త‌న‌కు చాలా ఎక్కువ అన్న స్టార్ ప్లేయ‌ర్‌

కోల్‌క‌తా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) స్టార్ ప్లేయ‌ర్‌ రింకూ సింగ్ ఏడేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఆడుతున్నాడు. కొన్ని సీజన్ల నుంచి కేకేఆర్‌ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. తన పవర్‌ హిట్టింగ్‌తో కోల్‌క‌తాకు అనేక‌ విజయాలు అందించాడు. అయితే, ఫ్రాంచైజీ అతడికి రూ.55 లక్షల జీతం మాత్రమే ఇస్తోంది. మ‌రోవైపు చాలా ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్ స్టార్క్‌ను అదే ఫ్రాంచైజీ ఇటీవ‌ల వేలంలో ఏకంగా రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదే విషయమై రింకూను ఓ ఇంటర్వ్యూలో ప్ర‌శ్నించ‌గా.. దానికి అతడు కూల్ గా బదులిచ్చాడు.

రింకూ సింగ్ మాట్లాడుతూ.. "నాకు రూ. 50- 55 లక్షలు కూడా చాలా ఎక్కువ. ఇంత సంపాదిస్తానని కూడా నేను ఎప్పుడూ ఊహించలేదు. నా చిన్న‌త‌నంలో రూ. 5- 10 రూపాయలు వస్తే చాలా ఎక్కువ‌ని భావించేవాడిని. ఇప్పుడు నేను ఏకంగా రూ. 55 లక్షలు సంపాదిస్తున్నా. ఇది చాలా ఎక్కువ. దేవుడు ఇచ్చిన దాంట్లోనే నేను సంతోషంగా ఉంటా. రూ. 55 లక్షల రూపాయలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది కూడా నా దగ్గర లేనప్పుడు, డబ్బు విలువ నాకు అర్థమైంది. నేనెప్పుడూ నాకు ఇంత ఇచ్చి ఉండాల్సింద‌ని లెక్కలు కూడా వేసుకోలేదు. అవి లేని రోజులను చవిచూశా. అందుకే డబ్బు విలువ నాకు తెలుసు" అంటూ రింకూ చెప్పుకొచ్చాడు.

ఇక రింకూ సింగ్‌ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే.. 2017లో ఈ క్యాష్‌ లీగ్ లోకి అడుగుపెట్టాడు. ఆ ఏడాది రింకూను పంజాబ్‌ కింగ్స్‌ జట్టు కొనుగోలు చేసింది. అయితే, ఆ సీజ‌న్‌లో అతడికి ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాతి ఏడాది జరిగిన వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ రింకూను రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది. అలా 2018లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున రింకూ తొలిసారి మైదానంలో దిగాడు. 

అప్ప‌టి నుంచి ఆ జ‌ట్టులో త‌న ప‌వ‌ర్ హిట్టింగ్‌తో కీల‌క ఆట‌గాడిగా మారాడు. అయితే, గాయం కారణంగా 2022లో రింకూ ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఇక 2023 ఐపీఎల్ మినీ వేలంలో మ‌ళ్లీ కేకేఆర్ అతడిని రూ. 55 లక్షలకు సొంతం చేసుకుంది. కాగా, ఈ ఏడాది జ‌రిగిన ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఈ యువ ఆట‌గాడికి బ్యాటింగ్ చేసే అవ‌కాశం అంత‌గా రాలేదు. దాంతో టోర్నీ మొత్తంలో కేవ‌లం 168 ప‌రుగులే చేశాడు.

  • Loading...

More Telugu News