Mohammed Kaif: రోహిత్, విరాట్‌కు ఇదే చివరి ఛాన్స్: మహ్మద్ కైఫ్

Mohammad Kaif sends last chance reminder to Rohit Sharma Virat Kohli ahead of T20 World Cup 2024

  • రోహిత్, విరాట్ రిటైర్మెంట్ కు దగ్గర్లో ఉన్నారన్న కైఫ్
  • ఇద్దరు క్రికెటర్లూ మరో రెండుమూడేళ్లల్లో రిటైర్ కావచ్చని అభిప్రాయం
  • భారత్ కోసం ప్రపంచకప్ గెలిచేందుకు వారికి ఇదే చివరి ఛాన్స్ అని వ్యాఖ్య

త్వరలో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అప్రమత్తం చేశాడు. దేశం కోసం ప్రపంచకప్ గెలిచేందుకు వారికి ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేశారు. 

‘‘తాను ఎక్కువ రోజులు ఆడలేనన్న విషయంం రోహిత్ శర్మకు తెలుసు. బహుశా మరో రెండు, మూడు ఏళ్లు అతడు ఆడొచ్చు, విరాట్ విషయం కూడా ఇంతే. కాబట్టి వారికి ఇదే చివరి అవకాశం. అహ్మదాబాద్ లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్ లో వారు కప్పు చేజార్చుకున్నారు. ఎవరో వారి నుంచి కప్ లాగేసుకున్నట్టు అనిపించింది. అభిమానుల గుండె పగిలింది’’ అని వ్యాఖ్యానించారు. 

2007లో భారత జట్టు ధోని సారథ్యంలో తొలి టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. నాటి జట్టులో రోహిత్ కూడా ఒక సభ్యుడు. ఇక 2011లో రెండో సారి టీ20 విశ్వవిజేతగా నిలిచింది. అప్పట్లో కోహ్లీ టీమిండియా సభ్యుడిగా ఉన్నాడు. ఇక విరాట్, రోహిత్ ఇద్దరూ 2013 నాటి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలుగా నిలిచారు. ఈసారి వరల్డ్ కప్ లో ఇద్దరూ కలిసి ఆడినా భారత్ ఫైనల్స్ లో కప్పు చేజార్చుకుంది. పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈసారి టీ20 వరల్డ్ కప్ భారత్ గ్రూప్ ఏ లో ఉంది. భారత్ తో పాటు అమెరికా, ఐర్లాండ్, కెనడా, పాకిస్థాన్, గ్రూప్ ఏ లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News