Stone Attack On Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసు నిందితుడికి బెయిల్ మంజూరు

Bail granted for accused in stone attack on CM Jagan case

  • ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి
  • సతీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు
  • విజయవాడ 8వ అదనపు జిల్లాకోర్టులో నిన్న బెయిల్ వాదనలు పూర్తి
  • నేడు తీర్పు వెలువరించిన న్యాయమూర్తి
  • షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్టు వెల్లడి

ఏపీ సీఎం జగన్ పై ఏప్రిల్ 13న విజయవాడలో రాయి దాడి జరగడం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సతీశ్ కు విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిన్న వాదనలు పూర్తి కాగా, తీర్పును నేటికి రిజర్వ్ చేశారు. 

ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి నేడు తీర్పు వెలువరించారు. నిందితుడు సతీశ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. శని, ఆదివారాలు పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని సతీశ్ ను ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది.

సతీశ్ ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు అందిన తర్వాత అతను విడుదల కానున్నాడు.

  • Loading...

More Telugu News