Bharateeyudu 2: భారతీయుడు-2 నుంచి రేపు రెండో సింగిల్ విడుదల

Second single form Bharateeyudu 2 will be out tomorrow

  • కమల్ హాసన్, శంకర్ కలయికలో భారతీయుడు-2
  • చెంగల్వ అనే పాటను రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్న చిత్రబృందం
  • అనిరుధ్ రవిచందర్ బాణీలు... రామజోగయ్యశాస్త్రి సాహిత్యం
  • ఆలపించిన అబ్బీ వి, శృతిక సముద్రాల

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం భారతీయుడు-2. ఈ చిత్రం నుంచి రేపు (మే 29) రెండో పాట విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం నేడు ప్రోమో వీడియో పంచుకుంది. 

చెంగల్వ... అంటూ సాగే ఈ గీతానికి అనిరుధ్ రవిచందర్ బాణీలు సమకూర్చగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. అబ్బీ వి, శృతిక సముద్రాల ఈ గీతాన్ని ఆలపించారు. రేపు ఉదయం 11 గంటలకు పూర్తి పాటను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ వెల్లడించింది. భారతీయుడు-2 చిత్రంలోని ఈ పాటను సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ లపై చిత్రీకరించినట్టు తెలుస్తోంది. 

గతంలో కమల్ హాసన్, శంకర్ కలయికలో వచ్చిన భారతీయుడు ఎంతటి బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు-2 వస్తోంది. ఇందులో కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని, నెడుముడి వేణు, ఢిల్లీ గణేశ్, మనోబాలా, గుల్షన్ గ్రోవర్ తదితరులు నటిస్తున్నారు.

More Telugu News