Vamsi: అందుకే వెనకబడిపోయానేమో: డైరెక్టర్ వంశీ

Vamsi Interview

  • కొంతకాలంగా సినిమాలు చేయని వంశీ
  • త్వరలో సెట్స్ పైకి కొత్త ప్రాజెక్టు  
  • తన కెరియర్లో పెద్ద సినిమా అంటూ వివరణ 
  • ఒంటరితనం ఇష్టమని వ్యాఖ్య  


వంశీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు .. ఆయన మార్క్ టేకింగును అభిమానించే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి వంశీ తాజాగా 'బిగ్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరియర్ కి సంబంధించిన అనేక ముచ్చట్లను పంచుకున్నారు. " వంశీ అనగానే కామెడీ గొప్పగా ఉంటుందని అంతా అనుకుంటారుగానీ, నిజానికి నా లైఫ్ లో కామెడీ లేదు" అని ఆయన అన్నారు. 

"సాధారణంగా ఒక సినిమా బాగా ఆడితే మరో నాలుగు సినిమాలు వస్తాయి. ఈ మధ్య కాలంలో నేను చేసిన సినిమాలు ఆడకపోవడం వలన కొత్తగా ఎలాంటి అవకాశాలు రావడం లేదు .. అందుకే వెనకబడిపోయి ఉంటాను. నేను ఊరుకి దూరంగా ఉండటం వలన అవకాశాలు రావడం లేదని అంటూ ఉంటారు. అవకాశమనేది అడవిలో ఉన్నా వెతుక్కుంటూ వస్తుంది. సిటీలో ఉంటే వచ్చి మీద పడిపోతారని నేను అనుకోవడం లేదు" అన్నారు. 

" నేను అందరికీ దూరంగా ఉంటాననేది కరెక్టు కాదు .. ఒంటరిగా ఉంటాను అంతే. ఎందుకంటే నేను చదువుకోవాలి .. రాసుకోవాలి. అంతేతప్ప నాకు ఈ సమాజం మీద ఎలాంటి ద్వేషమూ లేదు. చాలామంది ఇక్కడికి వస్తూనే ఉంటారు .. వెళుతూనే ఉంటారు.  అయితే ఎన్నో కుదిరితేనే కదా ఒక సినిమా పట్టాలెక్కేది. అలా కుదరడం వలన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ త్వరలో చేయబోతున్నాను. ఇది నా కెరియర్లోనే పెద్ద సినిమా అవుతుంది" అని చెప్పారు వంశీ.   

Vamsi
Director
Tollywood
  • Loading...

More Telugu News