NTR: ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం మేం నిరంతరం పని చేస్తాం: ప్రధాని మోదీ

PM Modi pays tributes to NTR on his birth anniversary

  • నేడు ఎన్టీఆర్ జయంతి
  • ఎన్టీఆర్ విశిష్ట నటుడు అంటూ మోదీ కితాబు
  • ఆయన ఎంతో దార్శనికత గల నేత అంటూ కొనియాడిన వైనం

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. 

"ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడ్ని స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికతల గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ఆయన పోషించిన పాత్రలను, ఆయన నాయకత్వ పటిమను అభిమానులు ఇప్పటికీ తలచుకుంటారు. ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం మేం నిరంతరం పనిచేస్తాం" అంటూ మోదీ ట్వీట్ చేశారు.

NTR
Birth Anniversary
Narendra Modi
TDP
BJP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News