Gunasekhar: గుణశేఖర్ న్యూ మూవీ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఇదే!

Euphoria Movie Update

  • ఇటీవల నిరాశపరిచిన గుణశేఖర్ 'శాకుంతలం'
  • తాజా చిత్రంగా రూపొందుతున్న 'యుఫోరియా'
  • త్వరలో సెట్స్ పైకి వెళుతున్న ప్రాజెక్టు


టాలీవుడ్ లో గుణశేఖర్ స్థానం ప్రత్యేకం. పౌరాణిక .. చారిత్రక చిత్రాలను గొప్పగా తెరకెక్కించగల సమర్ధుడాయన. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'రామాయణం' ..  'రుద్రమదేవి' .. 'శాకుంతలం' ఈ విషయాలను స్పష్టం చేస్తాయి. తన కథలకి అవసరమైన సెట్స్ .. గ్రాఫిక్స్ ఏ స్థాయిలో ఉండాలనే విషయంలో ఒక స్థిరమైన అభిప్రాయం ఉన్నవారాయన.

అలాంటి గుణశేఖర్ నుంచి ఈ రోజున ఎనౌన్స్ మెంట్ ఉందనగానే, గతంలో ఆయన చేయాలనుకున్న 'ప్రతాపరుద్రుడు' .. 'హిరణ్యకశిపుడు' వంటి సినిమాలకు సంబంధించిన అప్ డేట్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఆయన కొంతసేపటి క్రితం  'యుఫోరియా' అనే టైటిల్ ను వదిలారు.

టైటిల్ పోస్టర్ తో పాటు ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గుణశేఖర్ రచయితగా .. దర్శకనిర్మాతగా చేయనున్న ఈ సినిమా, ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పారు. తారాగణం .. సాంకేతిక నిపుణులు .. తదితర వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Gunasekhar
Director
Euphoria
  • Loading...

More Telugu News