Getup Srinu: గొడవలు పడకపోతే లైఫ్ బోర్ కొట్టేస్తుంది: గెటప్ శ్రీను

Getup Srinu Interview

  • 'జబర్దస్త్'తో పాప్యులర్ అయిన గెటప్ శ్రీను
  • సుధీర్ - రామ్ ప్రసాద్ గురించి ప్రస్తావన
  • సినిమాల్లోకి రావడంపై స్పందన 
  • ఎదగాలనుకోవడంలో తప్పులేదని వెల్లడి  


'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన ఆర్టిస్టులలో గెటప్ శ్రీను ఒకరు. తన స్కిట్స్ కి తన గెటప్ ను ఆకర్షణీయంగా చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఏ గెటప్ వేసినా అందులో ఇమిడిపోవడం ఆయన ప్రత్యేకత. అలాంటి గెటప్ శ్రీను, ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

" నేను .. సుధీర్ ముందుగా 'జబర్దస్త్'లోకి వెళ్లాము. ఆ తరువాత రైటర్ అవసరమైనప్పుడు రామ్ ప్రసాద్ రంగంలోకి వచ్చాడు. అప్పటి నుంచి ముగ్గురం కలిసి పనిచేస్తూ వెళ్లాము. ముగ్గురం మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. మా మధ్య గొడవలు కూడా జరిగేవి .. కాకపోతే అవి చాలా చిన్నచిన్నవి. అవి కూడా లేకపోతే లైఫ్ బోర్ కొట్టేస్తుంది" అని అన్నాడు. 

'జబర్దస్త్' మాకు మంచి ఫ్లాట్ ఫామ్ ఇచ్చింది. కెరియర్ పరంగా స్థిరత్వం రావడానికీ .. ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి కారణమైంది. అయితే ప్రతి మనిషి కూడా జీవితంలో ఎదగాలనే అనుకుంటాడు. మేము కూడా అలాగే ఆలోచించాము. అందువల్లనే టీవీ నుంచి సినిమాకి వెళ్లాము. ప్రస్తుతం ముగ్గురం కూడా బిజీగానే ఉన్నాము" అని చెప్పాడు. 

More Telugu News