Rangayana Raghu: అమెజాన్ ప్రైమ్ లో దూసుకుపోతున్న 'శాకాహారి' మూవీ!

Shakahari Movie Update

  • రంగయన రఘు ప్రధాన పాత్రగా 'శాకాహారి'
  • మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథ 
  • థియేటర్లలో హిట్ గా నిలిచిన సినిమా
  • ఓటీటీ వైపు నుంచి విపరీతమైన రెస్పాన్స్    


అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి ఈ వారం అడుగుపెట్టిన సినిమా 'శాకాహారి'. కన్నడలో రూపొందిన ఈ సినిమాకి సందీప్ దర్శకత్వం వహించాడు. రంగాయన రఘు ప్రధానమైన పాత్రను పోషించాడు. గోపాలకృష్ణ దేశ్ పాండే .. వినయ్ .. నిధి హెగ్డే కీలకమైన పాత్రలను పోషించారు. మర్డర్ మిస్టరీ జోనర్లో నిర్మితమైన సినిమా ఇది. 
 
అక్కడ కోటి రూపాయల లోపు బడ్జెట్ లో నిర్మితమైన సినిమా ఇది. థియేటర్ల నుంచి నుంచి ఈ సినిమా భారీ లాభాలను వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ జరుపుకుంటోంది. కన్నడలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను, ఇతర భాషా ప్రేక్షకులు సైతం ఒక రేంజ్ లో వీక్షిస్తున్నారు. దాంతో వ్యూస్ పరంగా ఈ సినిమా దూసుకుపోతోంది. 

కథ చాలా ఆసక్తికరంగా ఉంటూనే. సుబ్బన్న ఒక చిన్నపాటి శాకాహార హోటల్ నడుపుతుంటాడు. ఒకసారి వినయ్ అనే వ్యక్తిని పోలీసులు తరుముతూ రావడంతో అతను ఆ హోటల్లో తలదాచుకుంటాడు. భార్య హత్యకేసు నుంచి పారిపోయి వచ్చిన ఆ వ్యక్తికి సుబ్బన్న ఆశ్రయం ఇస్తాడు. ఫలితంగా ఏం జరుగుతుంది? సుబ్బన్న గతం ఏమిటి? అనేది మిగతా కథ. 

Rangayana Raghu
Shakahari Movie
Sandalwood
  • Loading...

More Telugu News