Phone Tapping Case: రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటల, ధర్మపురి అర్వింద్ సహా ఎందరిపైనో నిఘా... ఫోన్ ట్యాపింగ్‌లో వెలుగులోకి కీలక విషయాలు

Sensational facts revealed by Radhakrishna in phone tapping case

  • వాంగ్మూలంలో ఎన్నో విషయాలు వెల్లడించిన రాధాకిషన్ రావు
  • నాడు బీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు వెల్లడి
  • మీడియా యజమానుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు వెల్లడి

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అప్పటి బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురి ఫోన్లపై నిఘా పెట్టినట్లు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాధాకిషన్ రావు వాంగ్మూలంలో కీలక అంశాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. నాడు బీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లుగా రాధాకిషన్ రావు వెల్లడించారు.

నాటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలు ఉన్న శంభీపూర్ రాజుపై, కడియం శ్రీహరితో రాజయ్య విభేదాలపై నిఘా పెట్టినట్లుగా వెల్లడించారు. తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్ రెడ్డికి ఉన్న విభేదాలపై, తీగల కృష్ణారెడ్డి మీద, తీన్మార్ మల్లన్న ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలిపారు.

కాంగ్రెస్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, వారి అనుచరుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు తెలిపారు. మీడియా యజమానుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు వాంగ్మూలంలో తెలిపారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డులను ప్రణీత్ రావు విశ్లేషించినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News