Snake Hatchlings: బాత్రూంలో 30 పాము పిల్లలు... హడలిపోయిన ఇంటి యజమానులు

Thirty snake hatchlings spotted in bathroom

  • అసోంలోని నాగావ్ జిల్లాలో ఘటన
  • ఓ ఇంటి బాత్రూం నుంచి పాము పిల్లల రాక
  • అన్నింటిని పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టిన స్నేక్ క్యాచర్

ఒక పామును చూస్తే వామ్మో అని భయపడుతుంటారు. ఇక ఒకే చోట 30 పాము పిల్లలు కనిపిస్తే ఇంకేమైనా ఉందా? అసోంలోని నాగావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కలియాబోర్ ప్రాంతంలోని ఓ ఇంటి బాత్రూం నుంచి పాము పిల్లలు బయటికి వస్తుండడాన్ని గమనించిన ఆ ఇంటి వారు హడలిపోయాడు.

ఇరుగుపొరుగు వారికి కూడా ఈ విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం స్థానిక స్నేక్ క్యాచర్ సంజీబ్ దేకాకు సమాచారం అందిచడంతో, అతడు వెంటనే అక్కడికి చేరుకుని ఆ బాత్రూం నుంచి పాము పిల్లలన్నింటినీ బయటికి తీసుకువచ్చాడు. వాటిని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. 

కాగా, అవి విష సర్పాలు కాదని, సాధారణ నీటి పాములు గుర్తించారు.

More Telugu News