Monsoon: కేరళలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు: ఐఎండీ
- ఈ ఏడాది సకాలంలోనే నైరుతి రుతుపవనాలు
- మరో ఐదు రోజుల్లో కేరళలో రుతుపవనాల ప్రవేశం
- దక్షిణ భారతదేశంలో ఈసారి సాధారణం కంటే అత్యధిక వర్షపాతం
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే వస్తాయన్న అంచనాల నేపథ్యంలో, భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఆసక్తికర సమాచారం వెలువరించింది. కేరళలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని తియ్యని కబురు చెప్పింది. మరో ఐదు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ వెల్లడించింది.
అయితే, ఈ ఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. అదే సమయంలో వాయవ్య భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని... మధ్య, దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వివరించింది.