Yerneni Sithadevi: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి పట్ల చంద్రబాబు సంతాపం

Chandrababu condolences to ex minister Yerneni Sithadevi
  • నాడు ఎన్టీఆర్ క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సీతాదేవి
  • ఈ ఉదయం హైదరాబాదులో గుండెపోటుతో కన్నుమూత
  • ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంతి యెర్నేని సీతాదేవి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. సీతాదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాడు ఎన్టీఆర్ క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా సీతాదేవి తనదైన ముద్రవేశారని చంద్రబాబు కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 

యెర్నేని సీతాదేవి ఇవాళ ఉదయం హైదరాబాదులోని నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ముదినేపల్లి (ప్రస్తుతం ఏలూరు జిల్లా) నుంచి రెండు పర్యాయాలు ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె 2013లో బీజేపీలో చేరారు.
Yerneni Sithadevi
Chandrababu
NTR
Minister
TDP
BJP
Andhra Pradesh

More Telugu News