Dimonds: పొలంలో ఒకే రోజు రెండు వజ్రాలు లభ్యం.. కర్నూలు జిల్లాలో రైతు కూలీలకు పట్టిన అదృష్టం

Agriculture labour found two diamonds in karnool District
  • రూ.6 లక్షల నగదుతో పాటు 6 తులాల బంగారం ఇచ్చి సొంతం చేసుకున్న వ్యాపారి
  • మదనంతపురంలో ఓ రైతును వరించిన అదృష్టం
  • వారం రోజుల్లో పది వజ్రాలు లభ్యం.. గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేసిన వ్యాపారులు
తొలకరి వానలకు కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల పంట పండుతోంది. రాత్రికి రాత్రే రైతులు, కూలీలు లక్షాధికారులవుతున్నారు. వజ్రాల కోసం గాలిస్తున్న రైతులు, కూలీలపై ఓ కన్నేసి ఉంచుతున్న స్థానిక వ్యాపారులు.. విలువైన వజ్రాలు దొరికిన విషయం బయటకు పొక్కేలోగా డబ్బు, బంగారం ముట్టజెప్పి సొంతం చేసుకుంటున్నారు. వారం రోజుల్లో పది వజ్రాలు దొరకగా.. వ్యాపారులు భారీ మొత్తాలు చెల్లించి వాటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. తాజాగా ఆదివారం ఒక్కరోజే జొన్నగిరిలో రైతు కూలీలకు రెండు వజ్రాలు దొరికాయి. విషయం తెలిసి గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల ఊళ్లు, పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చి పొలాల్లో గాలిస్తున్నారు.
 
మదనంతపురం గ్రామానికి చెందిన ఓ రైతుకు ఇటీవల దొరికిన ఓ వజ్రానికి స్థానిక వ్యాపారి ఏకంగా రూ.15 లక్షలు ఇచ్చి కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులు చేస్తున్న కూలీలకు చెరో వజ్రం దొరికింది. ఇందులో ఒకదానికి రూ.6 లక్షల నగదుతో పాటు 6 తులాల బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి ఒకరు కొనుగోలు చేశారు. రెండో వజ్రాన్ని ఇంకా వేలం వేయలేదని, దానికి సుమారు రూ.12 లక్షలు పలకవచ్చని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.



Dimonds
karnool
Agriculture lands
two dimonds
farmers

More Telugu News