Dr Prakash Indian Tata: 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలు రాసి చరిత్ర సృష్టించిన ప్రపంచ ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడు!

84 Year old Ayurvedic doctor appears for 8th exams

  • ఆయుర్వేద వైద్యంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రకాశ్ ఇండియన్ టాటా
  • తొలుత ఐదో తరగతి పరీక్షలు.. ప్రస్తుతం ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రకాశ్
  • అమితాబ్ బచ్చన్, సనత్ జయసూర్య సహా పలువురు ప్రముఖులకు వైద్యం
  • 112 దేశాల్లో వైద్య సేవలు

చదువుకోవాలన్న తపన ఉండాలే కానీ అది వయసుకు ఏమాత్రం అడ్డుకాదని నిరూపించాడో వృద్ధుడు. 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలు రాసి రికార్డులకెక్కాడు. మధ్యప్రదేశ్‌లోని చింద్‌వాడాకు చెందిన ప్రకాశ్ ఇండియన్ టాటా ఆయుర్వేద వైద్యుడు. విద్యాజ్ఞానం అస్సలు లేకపోవడంతో తొలుత మధ్యప్రదేశ్ ఓపెన్ బోర్డు నుంచి ఐదో తరగతి పరీక్షలు రాశారు. ప్రస్తుతం 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.

   
ఆయన సాధారణ ఆయుర్వేద వైద్యుడేమీ కాదు. ఆయనకు ఎంతో పేరుంది. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, శిల్పాశెట్టి సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఎంతోమంది విదేశీ వ్యాపారవేత్తలకు సేవలు అందించారు. శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యకు కూడా ఆయన వైద్యం చేశారు. మొత్తం 112 దేశాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు కూడా ఆయుర్వేద వైద్యం చేశారు. ప్రస్తుతం 8వ తరగతి పరీక్షలు రాస్తున్న ఆయనను చూసిన విద్యార్థులు నోరెళ్లబెడుతున్నారు.

Dr Prakash Indian Tata
8th Class Exams
Indore
Amitabh Bachchan
Sanath Jayasuriya
  • Loading...

More Telugu News