Air Turbulence: ఎయిర్ టర్బులెన్స్ బారినపడిన మరో విమానం

Another plane hit by air turbulence

  • ఇటీవలే గగనతలంలో కుదుపులకు గురైన సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం
  • 73 ఏళ్ల ప్రయాణికుడి మృతి
  • తాజాగా ఖతార్ ఎయిర్ వేస్ విమానం కుదుపులకు గురైన వైనం
  • 12 మందికి గాయాలు
  • దోహా నుంచి డబ్లిన్ వెళుతున్న విమానం

ఇటీవల లండన్ నుంచి సింగపూర్ వెళుతున్న సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం తీవ్ర కుదుపుల (ఎయిర్ టర్బులెన్స్)కు గురైన కారణంగా 73 ఏళ్ల బ్రిటీష్ ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఆ ఘటనలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. దాంతో ఆ విమానాన్ని థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 

తాజాగా మరో విమానం ఎయిర్ టర్బులెన్స్ కు గురైంది. దోహా (ఖతార్) నుంచి డబ్లిన్ (ఐర్లాండ్) వెళుతున్న ఖతార్ ఎయిర్ వేస్ విమానం మార్గమధ్యంలో తుర్కియే (టర్కీ) గగనతలంలో తీవ్ర కుదుపులకు గురైంది. ఎయిర్ టర్బులెన్స్ సంభవించడంతో విమానం ఊగిపోయింది. దాంతో విమానంలోని 12 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి రావడంతో విమానం ముందుకు సాగింది. డబ్లిన్ లో సాఫీగా ల్యాండైంది.

Air Turbulence
Qatar Airways
Doha-Dublin
  • Loading...

More Telugu News