Kavya Maran: ఆనందంతో పరవశించి పోయిన కావ్య మారన్ .. వీడియో ఇదిగో!

Kavya Maran ecstatic after Sunrisers win Over Rajasthan Royals in Qualifier 2 in IPL 2024

  • ఆరేళ్ల తర్వాత ఫైనల్ చేరడంతో పట్టలేని సంతోషం
  • క్వాలిఫయర్-2లో హైదరాబాద్ గెలవడంతో సంబరాలు చేసుకున్న సన్‌రైజర్స్ ఓనర్
  • శిబిరంలోని సభ్యులతో కరచాలనం చేసి ఆనందాన్ని పంచుకున్న కావ్య
  • సంతోషంతో వెలిగిపోయిన ఆమె ముఖం.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్

ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్‌ ఫైనల్ చేరడంతో ఆ జట్టు యజమాని కావ్య మారన్ తెగ సంబరపడ్డారు. ఆనందంతో ఉప్పొంగిపోయారు. సన్‌రైజర్స్ జట్టు ప్రదర్శనకు అనుగుణంగా భావోద్వేగాలకు గురయ్యే ఆమె ముఖం ఈసారి వెలిగిపోయింది. తన జట్టు ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లడంతో ఆమె సంబరాల్లో మునిగిపోయారు. మ్యాచ్‌ గెలిచిన వెంటనే సన్‌రైజర్స్ శిబిరంలోని సభ్యులతో కరచాలనం చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిపోయాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు, ఫ్యాన్స్ కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఆరేళ్ల తర్వాత తమ జట్టు ఫైనల్ చేరడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి కప్పు కొట్టాలని సోషల్ మీడియా వేదికగా తమ ఆకాంక్షలను తెలియజేస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి చెన్నై వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులు తీవ్ర నిరాశలో కనిపించారు. రాజస్థాన్‌ అభిమాని అయిన ఓ యువతి మైదానంలో కన్నీళ్లు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

కాగా సన్‌రైజర్స్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్లు విఫలమయ్యారు. ధృవ్ జురెల్, యశస్వి జైస్వాల్ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. కాగా 176 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుతంగా కాపాడుకున్నారు. ఆల్‌రౌండర్ షాబాజ్ ఖాన్ 3 కీలకమైన వికెట్లు తీశాడు. మరోవైపు అభిషేక్ వర్మ 2 వికెట్లతో అదరగొట్టాడు. కాగా ఆదివారం (మే 26) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో కో‌ల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.

More Telugu News