Cambodia: కాంబోడియా నుంచి విశాఖ తిరిగొచ్చిన మానవ అక్రమ రవాణా బాధితులు
- విదేశాల్లో ఉద్యోగాల పేరిట స్కాం
- మోసగాళ్ల ఉచ్చులో నిరుద్యోగులు
- కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలంటూ ఎర
- నిరుద్యోగులను కాంబోడియా తీసుకెళ్లి చైనా కంపెనీలకు అమ్మేసిన ముఠా
- విశాఖ పోలీసుల చొరవతో బాధితులకు విముక్తి
విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఓ స్కాంలో చిక్కుకుని కాంబోడియాకు అక్రమ రవాణా అయిన బాధితులు విశాఖకు తిరిగి వచ్చే ప్రక్రియ షురూ అయింది. విశాఖ పోలీసుల చొరవతో ఏడుగురు బాధితులు ఈ సాయంత్రం విశాఖ చేరుకున్నారు. రాత్రి 9 గంటలకు వచ్చే విమానంలో మరికొందరు బాధితులు వచ్చే అవకాశం ఉంది. మొదటి దశలో వివిధ విమానాల ద్వారా 58 మంది బాధితులు స్వదేశానికి చేరుకోనున్నారు.
కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ మోసగాళ్ల వలలో చిక్కుకున్న 150 మంది నిరుద్యోగులు... రూ.1.50 లక్షల చొప్పున చెల్లించారు. వారిని ఉద్యోగాల పేరిట కాంబోడియా తరలించిన సదరు ముఠా... అక్కడ వారిని చైనా కంపెనీలకు విక్రయించింది.
అయితే, ఈ ముఠా నుంచి ఓ వ్యక్తి తప్పించుకుని వచ్చి విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మానవ అక్రమ రవాణా గుట్టురట్టయింది.