Kodali Nani: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి స్వల్ప అస్వస్థత

gudiwada mla kodali nani unwell

  • గురువారం నందివాడ పార్టీ నేతలతో ఎమ్మెల్యే సమావేశం
  • వారితో మాట్లాడుతూ సోఫాలో పక్కకు ఒరిగిపోయిన వైనం
  • జ్వరం రావడంతో నీరసించి అలా జరిగి ఉండొచ్చన్న వైద్యులు
  • ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ నాని వీడియో విడుదల

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో ఆయన నందివాడ మండల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతుండగా ఉన్నట్టుండి సోఫాలో ఒరిగిపోయారు. అయితే, నానికి జ్వరం రావడంతో నీరసించి అలా జరిగి ఉండొచ్చని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని నాని ఓ వీడియో విడుదల చేశారు.

Kodali Nani
YSRCP
Krishna District
Gudiwada
  • Loading...

More Telugu News