pappu chaiwala: పప్పూ చాయ్​ వాలా.. నెట్​ లో అదరగొడుతున్న మరో చాయ్​ స్టార్.. వీడియో ఇదిగో!

pappu chaiwala viral video

  • గుజరాత్ లోని సూరత్ లో చాయ్ వాలా ఫేమస్
  • ‘డాలీ చాయ్ వాలా’ తరహాలో ఆకట్టుకుంటున్నాడని కామెంట్లు
  • వీడియోకు ఏకంగా 42 మిలియన్ల వ్యూస్, లక్షల కొద్దీ లైకులు

కొన్నిరోజుల కిందట ‘డాలీ చాయ్ వాలా’ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఆయనకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇండియాకు వచ్చినప్పుడు.. ఆ టీ స్టాల్ దగ్గరికి వెళ్లి చాయ్ తాగడం కూడా వైరల్ గా మారింది. అలాంటి మరో చాయ్ వాలా ఇప్పుడు తెరపైకి వచ్చాడు.

గుజరాత్ లోని సూరత్ లో..
  • గుజరాత్ లోని సూరత్ లో న్యూసిటీ లైట్ రోడ్ ప్రాంతంలో ఈ పప్పూ చాయ్ వాలా దుకాణం ఉంది. ఆయన పాల ప్యాకెట్లను పైకి ఎగరేస్తూ పట్టుకోవడం.. పాలను దూరం నుంచి గిన్నెలో పోయడం వంటివి మరో యాక్షన్ చాయ్ వాలా అన్న పేరు తెచ్చాయి.
  • ఈ చాయ్ వాలా టీ మరీ స్పెషల్ గా కనిపిస్తోంది. పాలల్లో పుదీనా, లెమన్ గ్రాస్ వంటి ఆకులు, అల్లం, టీ పొడి వంటివన్నీ వేసి మరగబెట్టాడు. అందులో చక్కెర, ఇతర పదార్థాలు వేశాడు. చివరికి అవన్నీ వడగట్టి.. టీ సిద్ధం చేశాడు.
  • ఇదంతా కూడా ఒక స్టైల్ లో చేస్తూ ఉండటాన్ని వీడియో తీసిన కొందరు ఇన్ స్టాలో పోస్టు చేశారు. ఇది విపరీతంగా వైరల్ గా మారింది.
  • ఏకంగా 42 మిలియన్ల వ్యూస్, లక్షల కొద్దీ లైకులు, పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.
  • ‘ఈ చాయ్ వాలా బిల్ గేట్స్ ను కలవాలని అనుకుంటున్నాడు..’ అని కొందరు. ‘ఈసారి ఏకంగా ఎలన్ మస్క్ వచ్చి టీ తాగుతాడులే..’ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
  • ఇక ‘ఈ ఫీల్డ్ లో పోటీ పెరిగిపోయింది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి.. స్పెషల్ గా ఏదో ఒకటి చేయాల్సి వస్తోంది’ అని ఇంకొందరు ఆయనను సమర్థిస్తుంటే.. ‘ఏం.. పాల ప్యాకెట్లు, వస్తువులను పైకి ఎగిరేయకపోతే చాయ్ పెట్టడం వీలుకాదా..?’ అని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Zeel Bhuva | Food Blogger (@foodie_.life)

pappu chaiwala
Viral Videos
offbeat
Instagram
  • Loading...

More Telugu News